- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్:.. విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. పరారీలో డాక్టర్!
దిశ, వెబ్ డెస్క్: విశాఖ పెందుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై కిడ్నీ మార్పిడి ఆరోపణలు వెల్లువెత్తాయి. తన కిడ్నీని మార్చినట్లు పెందుర్తి వాంబేకాలనీకి చెందిన బాధితుడు వినయ్ ఫిర్యాదు చేశారు. ఇద్దరు మధ్యవర్తు కామరాజు, శ్రీను ద్వారా రూ.8.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు బాధితుడు చెబుతున్నారు. మాట్లాడుకున్న ప్రకారం తనకు డబ్బులు ఇవ్వలేదని, అంతేకాకుండా కిడ్నీని కూడా మార్చారని ఆరోపించారు.
అయితే డాక్టర్‌తో పాటు మధ్యవర్తులు పరారీ అయ్యారు. ఇక ఇదే విషయంపై పెందుర్తి పోలీసులు స్పందించారు. మధురవాడ పోలీసుల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు. మరోవైపు ఈ ఆస్పత్రికి లైసెన్స్ ఉందా...?, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు అనుమతి ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆస్పత్రిలోనే బాధితుడి కిడ్నీ మార్చారా..?.. లేక వేరొక ఆస్పత్రిలో మార్చారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ కిడ్నీ మార్పిడి వెనుక ఎంత మంది హస్తం ఉందనేది కూడా పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.