BJP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా

by srinivas |   ( Updated:2023-06-05 12:42:19.0  )
BJP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రహోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 8న రాష్ట్రంలో పర్యటిస్తారని షెడ్యూల్ విడుదల చేశారు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల 11న అమిత్ షా విశాఖకు వస్తారని రాష్ట్ర బీజేపీ నాయకులకు హోంశాఖ వర్గాలు సమాచారం అందించాయి. దీంతో అమిత్ షా సభకు రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో బీజేపీ స్పీడ్ పెంచింది. అమిత్ షాతో పాటు జేపీ నడ్డా కూడా ఏపీలో పర్యటించనున్నారు. ఇద్దరు బీజేపీ అగ్రనేతల పర్యటన నేపథ్యంలో రాష్ట్రానికి ఎలాంటి హామీ ఇస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story