- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొత్తుల వేళ బిగ్ షాక్.. యలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైంది. దీంతో రాష్ట్రంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు టీడీపీ కేటాయించాల్సి వస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ కార్యాలయాలపైనే దాడులు చేస్తున్నారు. అవసరమైతే రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లా యలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, జనసేనతో పొత్తుల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. యలమంచి సీటును జనసేన ఇవ్వొదంటూఆందోళనకు దిగారు. టీడీపీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. కుర్చీలు, కిటికీలు ధ్వంసం చేశారు. జనసేనకు సీటు ఇస్తే మద్దతివ్వమని హెచ్చరించారు. అవసరమైతే పార్టీ సీనియర్ నేతలు పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యలమంచిలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ - జనసేన - టీడీపీ పొత్తుపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2024
యలమంచిలి టికెట్ జనసేనకి ఇస్తున్నట్టు అధిష్ఠానం నుండి ఆదేశాలు రావటంతో ప్రగడ నాగేశ్వరావు అనుచరులు కుర్చీలను ద్వసం చేసి మాకుమ్మడి రాజీనామాకి సిద్దమయ్యారు. pic.twitter.com/iKOr0fQnwu