- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతర పేరుతో వాలంటీర్ల చేతివాటం.. పింఛన్ సొమ్ము పై వివాదం?
దిశ, చోడవరం: రోలుగుంట మండలం, కుసర్లపూడి లో పెద్దింటమ్మ జాతరకు వసూలు చేసిన పింఛన్ల సొమ్ముపై వివాదం రేగింది. అందరూ కలిసి నిర్ణయించిన దానికన్నా ఎక్కువ వసూలు చేయడంతో వివాదానికి దారితీసింది.చివరకు అధికారుల వద్దకు పంచాయతీకి చేరింది. లబ్ధిదారులకు అందించిన వివరాలిలా ఉన్నాయి. కుసర్లపూడిలో ఏటా పెద్దింటమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. అయితే దీనికి అందరి సహకారంతో పాటు వృద్దులకు మంజూరు చేసే పింఛను సొమ్ము నుంచి కొంత కేటాయిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈ ఏడాది ఒక్కో లబ్ధిదారు నుంచి వెయ్యి వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా వాలంటీర్లు వేలిముద్రలు వేయించుకుని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 1,500లు వసూలు చేసినట్లు తెలిసింది. మరో 84 మంది కొత్తగా పింఛను మంజూరైన లబ్ధిదారుల నుంచి మొత్తం పింఛను తీసుకున్నట్లు వారంతా ఆరోపిస్తున్నారు. దాదాపుగా గ్రామంలో ఐదొందలకు పైగా పింఛన్ల నుంచి వసూలు చేశారని, కొత్త వారికి పూర్తిగా ఇవ్వలేదని అధికారుల వద్ద వాపోయారు. మొత్తం 84 మంది తమచేత ముద్ర వేయించుకుని, పూర్తిగా సొమ్ము ఇవ్వలేదని అధికారులకు వివరించారు. దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.