- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: త్వరలో బీజేపీ కూడా పాదయాత్ర.. స్పష్టం చేసిన సోము వీర్రాజు
దిశ, ఉత్తరాంధ్ర: త్వరలోనే పాదయాత్రలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పది వేల శక్తి కేంద్రాల పరిధిలో పాదయాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ సర్కార్ తప్పిదాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక అంశాలు కలిపి లక్ష మేరకు ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. విశాఖ, అనకాపల్లి సహా 72 రైల్వే స్టేషన్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కుటుంబ పార్టీల్లోనే ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లపై టీడీపీ నేతలు మాట్లాడడం హస్యాస్పదమన్నారు. టీడీపీ హయాంలో వైసీపీ నేతల ఫోన్ ట్యాంపింగ్ జరిగిందని ఆయన గుర్తు చేశారు. అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాంపిగ్లు జరుతాయన్నారు. గత పార్టీ అదే చేసింది.. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేపిటల్ లేకుండా పోవడానికి కుటుంబ పార్టీలే కారణమని మండిపడ్డారు. జనంతో పొత్తు.. లేకపోతే జనసేనతో పొత్తు తాను అన్న మాటకు సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. ప్రజలను రోడ్ల మీద వదిలేసిన పార్టీలతో బీజేపీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
READ MORE
పవన్‌ను BJP నమ్మడం లేదా.. సోము వీర్రాజు మాటల వెనుక ఆంతర్యమేంటి?