Visakhaలో రౌడీ షీటర్ ఆత్మహత్య

by srinivas |
Visakhaలో రౌడీ షీటర్ ఆత్మహత్య
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ తిక్కవానిపాలెం వాడపేటలో రౌడీ షీటర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాడపేటకు చెందిన తిక్కాడా శ్యామ్(31) ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. శ్యామ్‌పై 2018లో దొంగతనం కేసు నమోదైంది. 2022లో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. 2022 డిసెంబర్ నెలలో గంజాయి కేసులో శ్యామ్ అరెస్టై జైలుకు వెళ్లారు. ఇటీవలే బెయిల్‌పై శ్యామ్ బయటకు వచ్చారు. ఇంతలోనే కోర్టు నుండి వారెంట్ రావడంతో మనస్థాపానికి గురైనట్లు బంధువులు చెబుతున్నారు. శ్యామ్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీఐ విజయ్ కుమార్ నేతృత్వంలో కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story