Visakha: తాగి ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దర్ని బలి తీసుకున్న కాంట్రాక్టర్

by srinivas |   ( Updated:2023-07-02 13:29:31.0  )
Visakha: తాగి ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దర్ని బలి తీసుకున్న కాంట్రాక్టర్
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదం చోటు చేసుకుంది. రెండు నిండు ప్రాణాలను డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ బలి తీసుకుంది. ప్రమాదంలో ఫ్లైఓవర్ పై నుండి కింద పడి గాయపడిన యశ్వంత్ అనే విద్యార్థి చికిత్స పొందుతు మృతి చెందారు. ఘటన స్థలం నుంచి హాస్పిటల్‌కి తరలిస్తుండగా జై కృష్ణ మృతి చెందారు. మరో విద్యార్థి హరి కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన కాకాని చార్విక్ మురళి నగర్‌లో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్‌గా చేస్తున్నారు. చార్విక్ స్వస్థలం గన్నవరం. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి రెండు నిండు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు అదుపులో ఉన్నారు. కేసును టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story