- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీవీ జీవితం ప్రయోగశాల వంటిది..నేటి యువతరం కచ్చితంగా అతని బయోగ్రఫీ తెలుసుకోవాల్సిందే!
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రజ్ఞాశాలని ఆయన జీవిత చరిత్ర ప్రస్తుత భావితరాలు తప్పకుండా తెలుసుకోవాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన పేరిట స్మారక భవనాలు నిర్మించాలని ఇందుకు వైజాగ్ బ్రాహ్మిణ్ వెల్ఫేర్ సొసైటీ కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కోరారు. పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం వైజాగ్ బ్రాహ్మిణ్ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ పి. వి. నారాయణ అధ్యక్షతన హోటల్ దసపల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత జీవీఎల్ మాట్లాడుతూ పి.వి. నరసింహారావు జీవితం ఒక ప్రయోగశాల వంటిదని కేంద్ర ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన శాఖలు ఇంకెవరూ చేపట్టలేదని ఈనాటి తరానికి ఆయన చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సుప్రీంకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాది డీవీఎస్ఏ సోమయాజులు మాట్లాడుతూ 1991లో దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు న్యూక్లియర్, ఆర్థిక శక్తి దేశానికి అందించారని చెప్పారు. ఫోఖ్రాన్ పరీక్షలు విషయం అప్పటి ప్రధాని వాజ్ పేయికి తెలియజేసి ఆ పరీక్షలు నిర్వహించేలా చేశారు. భారతదేశం ఈ స్థాయిలో ఉందంటే అందుకు పీవీ నరసింహారావు ఆలోచనలే కారణమని అన్నారు. పివి మనుమడు ఎన్.వి.సుభాష్ మాట్లాడుతూ ఎప్పుడు ఏ పని చేయాలో పివికి తెలుసని వెనుకబడిన తరగతులను రాజకీయాల్లో ప్రోత్సహించిన పాలనాదక్షుడన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేశాన్ని ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో నిలిపిన గొప్ప మేధావని, మానవ సంబంధాలకు ప్రాణం పోసిన తాత్వికుడన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ పీవీ మహోన్నతమైన వ్యక్తి. భారతజాతికి ఆరాధ్య దైవం అన్నారు.తన సొంత భూమి 800 ఎకరాలు దళితులకు ధారాదత్తం చేసిన భూ సంస్కరణలు అమలు చేసి చరతార్ధుడయ్యారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు మితభాషి అని పీవీకి భారతరత్న పురస్కారం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రులకు అభిమానధనులయ్యారని చెప్పారు.న్యాయవాది కె.వి రామ్మూర్తి మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి అన్నారు. సాహిత్యవేత్త,గొప్ప మేధావి గా పేరొందారని ఆయన స్థితప్రజ్ఞుడు, రాజకీయ రుషి అన్నారు. సెంచూరియన్ యూనివర్సిటీ కులపతి ప్రొఫెసర్ జిఎస్ఎల్ రాజు మాట్లాడుతూ దేశంలో సంస్కరణలు అమలు చేసి మూడు ట్రిలియన్ డాలర్లను పోగేసిన ఆర్థిక శాస్త్రవేత్త పివి అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్,యువనేత ద్రోణంరాజు శ్రీవాత్సవ, కెజిహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైజాగ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావూరి చరణ్ కుమార్,కన్వీనర్ పి. వి. నారాయణ పి. వి. మనుమడు ఎన్వీ సుభాష్ కు జ్ఞాపికను జీవీఎల్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో వైజాగ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు న్యాయవాది నరసింహమూర్తి, హనుమంతరావు,నండూరి సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్ నాగభూషణం, రామభద్రుడు, శర్మ రామకృష్ణ, కార్పొరేటర్ రాపర్తి కన్నా తదితరులు పాల్గొన్నారు.