- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్టే...!
దిశ, విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్టేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆశీలమెట్ట ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, అదానీని ఒప్పించడంలో తెలుగు వారి సత్తా చాటుకున్నామని కేఏ పాల్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను, జేడీ లక్ష్మీ నారాయణ కోర్టులో కేసులు వేశామని చెప్పారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అప్పుడే ప్రకటించారని కేఏ పాల్ తెలిపారు.
స్టీల్ ప్లాంట్ విలువ 8.20 లక్షల కోట్లు అని, తాను విశాఖ ఎంపీ కాకపోతే వచ్చే ఏడాది మార్చి తరువాత ప్లాంట్‌ను అమ్మేస్తారని కేఏ పాల్ జోస్యం చెప్పారు. స్టీల్ ప్లాంట‌్‌పై ఢిల్లీలో చర్చలు ఫలించాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్టేనని పాల్ వెల్లడించారు.. లోకేష్ ఢిల్లీలో ఉన్నా బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ దొరకలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరం తీసుకురాలేకపోయారని విమర్శించారు. సీఎం జగన్‌పై కూడా కేసులు ఉన్నాయని కేఏపాల్ గుర్తు చేశారు.