Mlc Election Counting: ఆదిలోనే అభ్యర్థులకు ముచ్చెమటలు

by srinivas |
Mlc Election Counting: ఆదిలోనే అభ్యర్థులకు ముచ్చెమటలు
X

దిశ, ఉత్తరాంధ్ర: పట్టభద్రుల నియోజవకర్గ ఎమ్మెల్సీ ఓట్ల (Graduate Mlc Elections) లెక్కింపులో అభ్యర్థులను ఆదిలోనే పోస్టల్ ఇన్‌వ్యాలీడ్ ఓట్లు ముచ్చెమటలు పట్టించాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 228 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఆరు జిల్లాల్లో 767 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు 583 మంది మాత్రమే ఓటును వినియోగించుకున్నారు. అందులో 228 ఓట్లు చెల్లకుండా పోయాయి.

అభ్యర్థుల గుండెల్లో రాయి

దీంతో పోస్టల్ బ్యాలెట్ శుభ సూచికమనుకున్న అభ్యర్థులకు గుండెల్లో రాయి పడినట్టయింది. పోస్టల్ బ్యాలెట్ పరిస్థితే ఈ విధంగా ఉంటే చాలా చోట్ల బ్యాలెట్‌లో ప్రాధాన్యత ఓట్లు సక్రమంగా వేయలేదనే ప్రచారం జరిగింది. సాధారణ బ్యాలెట్ పేపర్లు పరిశీలన తరువాత ఇంకెన్ని ఓట్లు చెల్లకుండా పోతాయోననే ఆందోళన బరిలో ఉన్న అభ్యర్థులు వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఒక్కో చేదువార్త అధికార పార్టీ అభ్యర్థులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

Next Story

Most Viewed