- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో జనసేన కనుమరుగు.. మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: త్వరలో జనసేన పార్టీ కనుమరుగవబోతోందని మంత్రి సీదిరి అప్పలరాజు జోస్యం చెప్పారు. విశాఖ పాత గాజువాకలో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జనసైనికుల శ్రమను డబ్బుల కోసం ఇతర పార్టీలకు పవన్ అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి పవన్ కల్యాఖ్ జనసేన పార్టీని తాకట్టు పెట్టారని విమర్శించారు. జనసైనికులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు సూచించారు.
అటు చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాలని మంత్రి అన్నారు. టీడీపీ హయాంలో బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు చాలా హీనంగా చూశారని ఆరోపించారు. సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మత్య్సకారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. నాయీ బ్రాహ్మణుల పట్ల కూడా చంద్రబాబు చాలా నీచంగా వ్యవహరించారని మంత్రి సీదిరి అప్పల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.