Visakha: చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరు: Minister Rajini

by srinivas |   ( Updated:2023-08-19 15:30:35.0  )
Visakha: చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో  లేరు: Minister Rajini
X

దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీని, చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరని మంత్రి విడదల రజని అన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబాగా చంద్రబాబు మారినట్టు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రాలకు ఓట్లు రాలవని తెలుసుకోవాలని హితవు పలికారు. గెలిచే అవకాశం లేదన్న ప్రస్టేషన్‌లో ఉన్నారని, ప్రజల్లో ఏ పార్టీకి ఎంత విశ్వాసం ఉందో మరోసారి రుజువు కాబోతుందన్నారు. చంద్రబాబు నాయుడు మంత్రాలు చదవాలని ప్రజలకు చెప్తుంటే నవ్వొస్తుందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేస్తుంటే మహిళలు నవ్వుకుంటున్నారని మంత్రి రజిని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed