తుప్పు పట్టిన సైకిల్.. పగిలిపోయిన గ్లాస్ అంటూ ఏపీ మంత్రి సెటైర్స్

by srinivas |   ( Updated:2024-02-24 10:41:07.0  )
తుప్పు పట్టిన సైకిల్.. పగిలిపోయిన గ్లాస్ అంటూ ఏపీ మంత్రి సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు. మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ఫైనల్ చేశారు, తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ఐదుగురు జనసేన అభ్యర్థులు కాగా మిగిలిన సీట్లకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో వైసీపీ నేతల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. మంత్రులు నుంచి ఎమ్మెల్యేల వరకు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి మరీ విమర్శలు కురిపిస్తున్నారు.


తాజాగా టీడీపీ, జనసేన పొత్తులు, అభ్యర్థుల ప్రకటనపై మంత్రి అమర్‌నాథ్ విమర్శలు చేశారు. తప్పుపట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాస్‌కు గోల్డ్ కోటింగ్ వేసి ప్రజల ముందుకు తీసుకువచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.తొలి జాబితాలో జనసేన, టీడీపీ బలహీనతలు బయటపడ్డాయని విమర్శించారు. విశాఖలో మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్ జగన్ చేసిన పాలన, సంక్షేమ పథకాలను చూసి ఓటేయమని అడుగుతున్నాం.. కానీ పొత్తును చూసి టీడీపీ, జనసేన ఓటు వేయమని అడుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు రెండోసారి అధికారంలోకి తీసుకువస్తారని బలంగా నమ్ముతున్నాం.మొన్నటి వరకూ డబ్బులకు ఓట్లు కొనద్దన్నారు. ఇప్పుడేమో డబ్బులు ఖర్చు పెట్టాలని అంటున్నారు. ఇందులో సోషల్ ఇంజినీరింగ్ ఎక్కడ కనిపిస్తోంది. కేవలం ప్యాకేజీంగ్ ఇంజినీరింగ్ తప్ప. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. అనకాపల్లిలో ఎవరైనా పోటీ చేయొచ్చు. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనేదానిపై చంద్రబాబు ఇంకా క్లారిటీ ఇచ్చి ఉండరు. చంద్రబాబు నిర్ణయంపైనే పవన్ కల్యాణ్ పోటీ ఉంటుంది. గతంలో చంద్రబాబు 2 సీట్లు ప్రకటిస్తే.. పవన్ కల్యాణ్ కూడా 2 సీట్లు ప్రకటించారు. ఇప్పుడు 94 సీట్లకు అభ్యర్థులను టీడీపీ ప్రకటిస్తే..?, పవన్ కల్యాణ్ 5 సీట్లు ప్రకటమేంటి..? 24 సీట్లకే పరిమితమైనందుకు జనసైనికులకు పవన్ సమాధానం చెప్పాలి. ప్రజల కోసం కాకుండా అధికారంలోకి రావడం కోసం పొత్తులు పెట్టుకున్నామని టీడీపీ, జనసేన చెబుతున్నాయి. గతంలో తాము చేసిన పనులు చూసి ఓటు వేయండని ఆ రెండు పార్టీలు ప్రజలను అడగడంలేదు.’ అని మంత్రి అర్ నాథ్ విమర్శించారు.

Read More..

జనసేనకు 24 అసెంబ్లీ స్థానాల కేటాయింపు పై ఆర్జీవీ రియాక్షన్

Advertisement

Next Story

Most Viewed