- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హృదయ విదారకగాథ.. 26 ఏళ్ల తర్వాత ఇంటికి..
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఎప్పుడో 26 సంవత్సరాల కిందట ఇంటి నుంచి వచ్చేసి రోడ్ల మీద బతుకుతున్న ఓ వ్యక్తి.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ చొరవతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. బెంగాల్‌కు చెందిన బిశ్వజిత్ (50) ది హృదయ విదారకరమైన గాథ. మూడు నెలల క్రితం ఈఏఎస్ శర్మ విశాఖలో అనాధ ఆశ్రమాలు నడుపుతున్న ఏయూటీడీ సెక్రటరీ ప్రగడ వాసుకు ఫోన్ చేసి మానసిక పరిస్థితి బాగాలేని ఓ వ్యక్తిని అనాధాశ్రమంలో చేర్పించారు.
అతని పేరుతో మిస్సింగ్ కేసు..
ఇతని పేరున మిస్సింగ్ కేసు ఉండటంతో డ్యూటీ డాక్టర్ రాకేష్ పేషెంట్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తి సోదరుడు బాంగ్సీ బదన్ కుటుంబంతో వెంటనే వైజాగ్ ఆసుపత్రికి చేరుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం వారిది పశ్చిమ బెంగాల్ బాంకుర జిల్లాలోని మదన్ మోహన్ పూర్ గ్రామం. తమ సోదరుడి కోసం చాలా కాలం వెతికామని ఇన్నాళ్లకు దొరికినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.