- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Left Parties: ఈ నెల 30న విశాఖలో మహాధర్నా
దిశ, గాజువాక: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈ నెల 30 న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహా ధర్నాను నిర్వహించాలని వామ పక్ష పార్టీలు తీర్మానించాయి. శుక్రవారం గాజువాక సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సీపీఐ గాజువాక నియోజక వర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పారు.
సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. ఐ.ఎఫ్.టి.యూ నాయకులు కె.మల్లయ్య మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలతో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గేవరకు పోరాటం చేస్తామని అన్నారు.