- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan kalyan: సీఎం జగన్కు ఎన్ని ఇళ్లు కావాలి?
దిశ, ఉత్తరాంధ్ర: సీఎం జగన్కు ఎన్ని ఇళ్లు కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ నిర్మిస్తారా అంటూ ఆయన ధ్వజమెత్తారు. పోలీసుల ఆంక్షల మధ్య విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగించారు. ఎట్టకేలకు ఆంక్షల మధ్య రుషికొండను పవన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారు. రుషికొండపై నిర్మాణాలకు అన్ని అనుమతులు వచ్చాయా?. తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ విశాఖ నగరాన్ని కాపాడుతుంది. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. తెలంగాణను కూడా ఇలాగే దోచేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల భూములను ప్రజల దగ్గర లాకుంటున్నారు. చట్టాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. రుషికొండ నిర్మాణం అంతా పుర్తిగా వైలేషన్ చేసి కట్టారు. ప్రశాంతంగా ఉన్న ప్రజలపై దోపిడీ చేస్తూ జగన్ సర్కార్ అన్యాయం చేస్తుంది.’ అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.