- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఆ రోజును మర్చిపోలేను.. 24లో జెండా ఎగురువేస్తాం: Pawan Kalyan
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో ‘వారాహి’ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గాజువాకలో తాను ఓడిపోయినట్లు అనిపించలేదన్నారు. జనసేన ఆశయం ఓడిపోలేదని, ప్రజల అండగా ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఒక ఆశయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి ప్రజలందరూ అండగా నిలబడ్డారని పవన్ గుర్తు చేశారు. ఆ రోజును తాను మర్చిపోలేనని, తన నటనలో ఓనమాలు విశాఖలోనే దిద్దుకున్నానని పవన్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ఆట, పాట, సంస్కృతి, కవిత్వం, పొయిట్రీ అన్ని విశాఖలోనే నేర్చుకున్నానని తెలిపారు. పోరాటం కూడా అక్కడే నేర్చుకున్నానన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన జెండా గాజువాకలో ఎగురుతుందని పవన్ దీమా వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తనకు విశాఖలో దారి పోడవునా వినిపించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా కీలకమైన అంశమన్నారు. విశాఖ ఉక్కు కోసం ఉమ్మడి ఏపీలో చాలా బలిదానాలు జరిగాయని గుర్తు చేశారు. పోలీసుల కాల్పుల్లో 30 మందికి పైగా చనిపోయారని చెప్పారు. అలాంటి పోరాటం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందన్నారు.. ఏపీకి విశాఖ ఉక్కు గుండెపట్టులాంటిదని పవన్ స్పష్టం చేశారు.
Read more :
పవన్ కల్యాణ్‌పై కేసు పెడతాం.. అక్కడ సెంటు భూమి ఉన్నా రాసిచ్చేస్తా : మంత్రి గుడివాడ అమర్నాథ్