- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:జగన్ పాలన అంటే నిరుద్యోగం,మద్యం,డ్రగ్స్..టీడీపీ ఇంచార్జ్ షాకింగ్ కామెంట్స్
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:జగన్ పాలన అంటే నిరుద్యోగం,మద్యం,డ్రగ్స్ అని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో బాబ్జి మాట్లాడుతూ జగన్ పాలన లో రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, గంజాయి, డ్రగ్స్ ,నిరుద్యోగం తాండవిస్తున్నాయని అన్నారు.రాష్ట్రంలో దోపిడీలు నిత్యకృత్యం అయిపోయాయని అన్నారు.దోపిడీలపై ప్రశ్నిస్తున్న వారిని పోలీసులతో బెదిరిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, జగన్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేసి వాలంటీర్ వ్యవస్థ ను పెట్టుకొని పాలన చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ తీసుకువచ్చిన మద్యం విధానాన్ని రద్దు చేస్తామని, అన్న కేంటీన్ వ్యవస్థను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ను తీసేస్తారని పుకార్లు వస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదని వాలంటీర్ వ్యవస్థలో లోపాలు సరిచేసి కొనసాగిస్తామని స్పష్టం చేవారు.విశాఖ డ్రగ్స్ కేసును అవినాష్ రెడ్డి కేసు లాగే నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.సమావేశంలో ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.