సీఎం వస్తే విశాఖ లో కర్ఫ్యూ వాతావరణమా?

by Jakkula Mamatha |
సీఎం వస్తే విశాఖ లో కర్ఫ్యూ వాతావరణమా?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: శారద పీఠానికి సీఎం జగన్ వస్తే విశాఖ లో ఇన్ని ఆంక్షలు పెట్టడమేమిటని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కాదు ప్రధాని , రాష్ట్రపతి వంటి వారు వచ్చినప్పుడు కూడా విశాఖ నగరంలో ఇన్నీ ఆంక్షలు లేవని ఆయన విలేకరుల సమావేశంలో అవేదన వ్యక్తం చేశారు.

జగన్ పర్యటన సందర్భంగా ఈవెంట్ మేనేజర్ ను పెట్టి రోడ్డు కి ఇరువైపులా ప్రజల ను ఎండలో నిలబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అలా నిలబడకపోతే ఇబ్బందులు తప్పవని డ్వాక్రా మహిళలు, సచివాలయ ఉద్యోగుల ను జీవీఎంసీ అధికారులు బెదిరించడమేమిటని నిలదీశారు. ఎయిర్ పోర్ట్ నుంచి శారద పీఠం వరకు టీడీపీ జెండాల ను పోలీసులు పీకేశారని, వైసీపీ జెండాలను మాత్రం ఉంచారని అన్నారు. ముఖ్యమంత్రి వస్తే కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉండడం ఏమిటి అని ఎద్దేవా చేశారు. జగన్ విశాఖ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

అంతే కాకుండా ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్,ఈనాడు సంస్థల పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి సొమ్ము తో సాక్షి ని పెట్టారని, ఆ సంస్థ నుంచి బయటకు రావాలని ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. ’ రెండు నెలలు తర్వాత మేము అధికారంలో వస్తే..అప్పుడు సాక్షి సోదరుల కు ఎవరు భద్రత కల్పిస్తారు?మేము అధికారంలో కి వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి? రేపు మీ సాక్షి కి కూడా ఇదే గతి పడుతుంది’ అని బండారు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed