- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే అమ్మాయికి ఎన్ని సార్లు పెళ్లి చేస్తారంటూ? ఉతికి ఆరేస్తున్న సోషల్ మీడియా!
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఒకటో తేదీన పెన్షన్ లను తెల్లవారుజామునుంచే పంపిణీ చేస్తున్నామని , రకరాకాల ఇబ్బందులు, పనుల్లో వున్నవారికి కూడా ఠంచనుగా ఇచ్చేస్తున్నామని చెప్పుకునేందుకు వైకాపా సోషల్ మీడియా చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. అన్ని బాగానే వున్నా ఆర్టిస్ట్ ను మార్చకపోవడం కొంప ముంచింది. దీంతో సజ్జల భార్గవ్ టీం అడ్డంగా బుక్కయిందంటూ సోషల్ మీడియాలో ఒకటే సెటైర్లు, ఇంతకీ విషయం ఏమిటంటే అప్పడే వివాహం అయిన యువతి కి కూడా పెన్షన్ పెళ్లి బట్టలతో ఉండగానే ఇచ్చేశామని చెప్పుకొనేందుకు చేసిన ప్రయోగం వికటించింది. గతంలో ఒక సారి అదే ఆర్టిస్ట్ తో అదే స్క్రిప్ట్ తో అదే పెళ్లి ప్రయోగం చేయడమే ఇందుకు కారణం.
ఒక్క ఆమెకే ఎన్నిసార్లు పెళ్లి చేస్తారురా.... నగలు కూడా సేమ్ స్క్రిప్ట్ పాతదే కదా కనీసం ఆర్టిస్టులను అయిన మార్చండి..పాతవాళ్లనే పెడితే ఇలాగే దొరికిపోతారు. చిన్న సజ్జలా’ అంటూ ఒక పోస్టింగ్ ఎగతాళి చేసింది. మొన్న పెళ్లికి ముందు పింఛన్ ఇచ్చిన వాలంటీర్ నిన్న పెళ్లికి ముందు పింఛన్ ఇచ్చిన వాలంటీర్ ఎన్ని రోజులు పెళ్లి చేసుకుంటావు అక్కా’ అని మరో కామెంట్’.పెళ్ళి ముహూర్తానికి ముందు పింఛన్ ఇచ్చిన వాలంటీర్ అని రెండు ఫోటోలు బాగానే ఎక్స్ ట్రాలు అని మరో కామెంట్ . ఇలా ఆదివారం నాడు పెళ్లి పెన్షన్ సబ్జెక్ట్ సోషల్ మీడియా కామెడీకి వేదికైంది.