Visakha: గోకుల్ థియేటర్‌లో ‘న్యూసెన్స్’.. హీరో నవదీప్ ఏమన్నారంటే...!

by srinivas |
Visakha: గోకుల్ థియేటర్‌లో ‘న్యూసెన్స్’.. హీరో నవదీప్ ఏమన్నారంటే...!
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నం: ‘న్యూసెన్స్’ మూవీ అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టు ఉందని ఆ చిత్ర హీరో నవదీప్ తెలిపారు. విశాఖ గోకుల్ థియేటర్‌లో పాత్రికేయులకు, మరికొందరు ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ప్రీమియర్ షో అనంతరం చిత్ర హీరో నవదీప్ మీడియాతో మాట్లాడుతూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఘన విజయం సాధించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు మా చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘న్యూసెన్స్’ పేరుతో విడుదలైన తమ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తమ చిత్రం కథ ఎంతో బాగుందంటూ సోషల్ మీడియాలో, అనేక వెబ్ సైట్స్ ద్వారా చక్కని రేటింగ్ ఇవ్వడం పట్ల హర్షం వెలుబుచ్చారు.

ఇప్పుటి వరకు థియేటర్ రిలీజ్ అయి విజయం సాధించిన సినిమాలు చాలా ఉన్నాయని, హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత సక్సెస్ మీట్ చేసుకోవడమే ఎంతో సంతోషం కలిగించేదని, కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా డిజిటల్ కంటెంట్‌లో వెబ్ సిరీస్ చేసి ప్రేక్షక ఆదరణ లభించిన తర్వాత సక్సెస్ టూర్ ఈ విధంగా ప్రేక్షకుల మధ్య జరుపుకోవడం, అది కూడా విశాఖ వచ్చి ప్రేక్షకులతో కలసి సినిమా చూడడం ఎంతగానో కొత్త అనుభూతినిచ్చిందని నవదీప్ తెలిపారు. త్వరలో ‘లవ్ మౌళి’ అని కొత్త ప్రేమ కథాంశంతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా మాస్ మహరాజ్ రవితేజతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. విశాఖ అంటే తనకి ఎనలేని ఇష్టమైన ప్రాంతంగా నవదీప్ పేర్కొన్నారు. హీరోయిన్‌గా నటించిన బిందు మాధవి ఎంతో చక్కగా నటించిందని ఆమె క్యారెక్టర్ కూడా ఒక కొత్త తరహాలో ఉందని పేర్కొన్నారు. మా చిత్రానికి అన్ని విధాలుగా సహకరించిన ప్రముఖ ఓటీటీ సంస్థ "ఆహా" ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story