- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రూప్-2 మోడల్ పరీక్ష
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అల్లూరి విజ్ఞాన కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) విశాఖ జిల్లా కమిటీ గురువారం గ్రూప్ 2 మోడల్ పరీక్ష నిర్వహించింది. పరీక్ష పేపర్ ను అల్లూరి విజ్ఞాన కేంద్రం బాధ్యులు పద్మనాభ రాజు ప్రారంభించారు. యువజన సంఘం మాజీ నాయకులు ఎస్.పుణ్యవతి మోడల్ పరీక్ష విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పుణ్యవతి గారు మాట్లాడుతు.. యువజన సంఘం ఈ విధంగా పరీక్ష నిర్వహించిన అభినందనీయమని అన్నారు. అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాన పరీక్షలో అభ్యర్థులు మంచి ఫలితాలు సాధించి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా డీవైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు రాజు, సంతోష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ నిరుద్యోగుల సమస్యల పైన నిరంతరం పోరాడుతుందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించి సాధించిందని తెలిపారు. ఉద్యమాలే కాకుండా అభ్యర్థులకు సహాయ పడాలన్న ఉద్దేశంతో గ్రూప్ 2 మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడల్ పరీక్షకు జిల్లా నాయకులు కోటి, అక్బర్ నాయకత్వం వహించారు. పలువురు గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు.
Read More..