గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సెమినార్‌ను ప్రారంభించిన.. సీఎం జగన్

by Hamsa |
గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సెమినార్‌ను ప్రారంభించిన.. సీఎం జగన్
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌ను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, సయంట్‌ అధినేత మోహన్‌రెడ్డి, అదానీ పోర్ట్స్‌ సీఈవో కరణ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్‌ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూపు ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల సదస్సుకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చర్చాగోష్ఠులు జరగనున్నాయి. వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై వారు చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం మైదానంలో అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ముగియనుంది.

Advertisement

Next Story

Most Viewed