Bjp: వారంలో ఆ పేరు మార్చాలి.. లేదంటే పోరాటమే..!

by srinivas |
Bjp: వారంలో ఆ పేరు మార్చాలి.. లేదంటే పోరాటమే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో వీధి పేర్లు కూడా వైఎస్ఆర్ పేర్లు పెడతారేమోనని మాధవ్ ఎద్దేవా చేశారు. సింహాచలం చందనోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని మాధవ్ విమర్శించారు. కొండ మీదే సీఎం జగన్ డౌన్ డౌన్ అన్నారంటే.. చందనోత్సవం ఏ విధంగా నిర్వహించారనేది అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీశారని..భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story