- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ganta Srinivasa Rao: వాళ్లను వదలం.. గుణపాఠం చెబుతాం
దిశ, గాజువాక: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండ కడతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో నిర్వహించిన బస్సు యాత్ర గాజువాకలో జరిగింది. అనంతరం జరిగిన సభలో మాజీ మంత్రి , విశాఖ నార్త్ ఎం.ఎల్. ఏ గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో చాలా అవినీతి, అక్రమాలకు పాల్పడిందని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచారని ఏద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగిస్తుందని గంటా జోస్యం చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం గుట్టు విప్పుతామని హెచ్చరించారు
తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ ఎం.ఎల్. ఏ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల రాజమండ్రిలో జరిగిన మహానాడులో మిని మేనిఫెస్టోను విడుదల చేశామని, ఆ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రను చేపట్టామని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నుంచి రక్షించడానికి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. గంగవరం పోర్టును ఆదానికి కేంద్ర ప్రభుత్వం కట్ట బెడితే వైసీపీ ప్రభుత్వం నోరు మెదపకుండా ఉండడం దారుణమన్నారు.