AP Politics:ఎమ్మెల్సీ ఎన్నికల పై మాజీ సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్..!

by Jakkula Mamatha |
AP Politics:ఎమ్మెల్సీ ఎన్నికల పై మాజీ సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్..!
X

దిశ,వెబ్‌డెస్క్:విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించే క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ నేడు (బుధవారం) సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి నల్లేరుపై నడక. విశాఖ జిల్లాకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో వైసీపీకి క్లీన్ మెజారిటీ ఉంది. కానీ టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెడితే పరిస్థితిలో తేడా వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే కొందరు విశాఖ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లోకి చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ ఫిరాయింపులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఆగస్టు 30న జరుగబోతున్న విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పై మాజీ సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదేళ్లు కూటమిదే అధికారం కాబట్టి ఫిరాయింపులను ఎవరూ ఆపలేరు.

వైసీపీ మాత్రం తమ నేతలెవరూ ప్రలోభాలకు లొంగరని, పార్టీని అంటిపెట్టుకునే ఉంటారని ధీమాగా చెబుతోంది. ఈ ధీమా ఎన్నికల వరకు ఉండాలని మధ్యలో జగన్ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని చర్చించుకుంటున్నారు..ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా ఓటర్లుగా ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరూ చేజారకూడదని వైసీపీ ఆలోచనలు చేస్తుంది. ఈ క్రమంలో క్యాంప్ రాజకీయాలకు తెర తీస్తేనే తమవైపు ఎవరున్నారు, ఎవరు కూటమి వైపు వెళ్లాలనుకుంటున్నారో తేలిపోతుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed