నెలాఖరు వచ్చినా జీతాలు, పెన్షన్లు పడలేదని ఆందోళన చెందుతున్న ఉద్యోగులు!

by Jakkula Mamatha |
నెలాఖరు వచ్చినా జీతాలు, పెన్షన్లు పడలేదని ఆందోళన చెందుతున్న ఉద్యోగులు!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఫిబ్రవరి మాసంతం వచ్చేసింది.అయినా ఆంధ్ర విశ్వవిద్యాలయం తో పాటు పలు విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, ఉద్యోగులకు జీతాలు రాలేదు. పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ లు రాలేదు. ఐదో తేదీ నాటికి రావాల్సిన జీతాలు ఈ ప్రభుత్వంలో పది, పదిహేను తేదీల్లో వచ్చేవి. 29 వ తేదీ తో ఫిబ్రవరి ముగుస్తుండగా 28 న కూడా జీతాలు, పెన్షన్లు రాకపోవడంతో ఉద్యోగాలు నిరాశ చెందారు. సకాలంలో జీతాలు, పెన్షన్లు రాకపోవడంతో బ్యాంకు వాయిదాలు, నెలవారీ నిర్ణీత సమయంలో కట్టాల్సిన మొత్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నెలలో జీతాలు రావనే నిర్ణయానికి ఉద్యోగులు వచ్చేశారు. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు నిధుల సమస్య ను ఎదుర్కోవడమే ఇందుకు కారణమని తెలిసింది. వచ్చే నెలలోనూ జాప్యం కావచ్చని అంటున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నారు. జీతాల గురించి గట్టిగా అడిగితే ప్రభుత్వం నుంచి వేధింపులు వుంటాయనే భయంతో ఉద్యోగ సంఘాలు నోరు విప్పడం లేదు.

Advertisement

Next Story

Most Viewed