ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచ తప్పక పాటించాలి:జాయింట్ కలెక్టర్

by Jakkula Mamatha |
ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచ తప్పక పాటించాలి:జాయింట్ కలెక్టర్
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచ తప్పక పాటించాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని అన్నారు. నోటిఫికేషన్ జారీ అయిన క్షణం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి అధికారి గుర్తించాలని స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయం వీడియో సమావేశ మందిరంలో జగనన్నకు చెబుదాంజిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచ తప్పక పాటించాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు.కార్యక్రమం జేసీ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే తమ కార్యాలయాల్లో, ప్రాంగణాల్లో గల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల ఫోటోలను తొలగించాలని చెప్పారు. అలాగే విగ్రహాలను మూసి వేయాలని వివరించారు.

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ప్రవర్తన నియమావళి లోకి వస్తారని, ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు.ఎన్నికలకు సంబంధించి ఉద్యోగుల వివరాలతో పాటు ఎపిక్ కార్డు నెంబర్లను అందించాలని రెండు వారాల క్రితమే జిల్లా అధికారులను కోరడం జరిగిందన్నారు. అయితే జిల్లాలో 15 వేల మందికి గాను 1500 మంది ఉద్యోగులు మాత్రమే ఎపిక్ నెంబర్ ని అందించారని పోలింగ్ పర్సనల్ మేనేజ్మెంట్ తెలిపిందన్నారు. ఇప్పటివరకు ఎపిక్ కార్డు నెంబర్లను ఇవ్వని వారందరూ మంగళవారం లోగా ఆన్లైన్ చేయాలని జిల్లా అధికారులను జేసీ ఆదేశించారు.

జిల్లా కార్యాలయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్, ఆప్కాస్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు తమకు అందజేయాలని జిల్లా అధికారులను జేసీ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల్లో వీరి సేవలను కూడా వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. కావున రెండు రోజుల్లోగా సిబ్బంది వివరాలు అందించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.మోహన్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్, డి ఎల్ డి ఓ ఆర్.పూర్ణిమా దేవి,జీవియంసి, పోలీస్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story