- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బీచ్ లో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతానోత్పత్తికి సంరక్షణ చర్యలు
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు మహా విశాఖ నగర పరిధిలో గల బీచ్ లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతానోత్పత్తికి సంరక్షణ, పరిశుభ్రత చర్యలు చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ సోమవారం ప్రకటన లో తెలిపారు. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో గల అన్ని బీచ్ ల నందు ఎకో వైజాగ్ నేపథ్యంలో ఎకో బ్లూ కార్యక్రమంలో భాగంగా, నిత్యం అన్ని బీచ్ లలో మెకానికల్ బీచ్ క్లీనింగ్ యంత్రాలతో పరిశుభ్రంగా సుందరమైన బీచ్ లుగా జీవీఎంసీ తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.
అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్ర తీర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో వలస వచ్చి గుడ్లు పెట్టి వాటి సంతానాన్ని వృద్ధి చేసుకొని మరలా మే నెలలో వాటి పిల్లలతో సముద్రంలో చేరుకునే ప్రక్రియ ప్రతి సంవత్సరం విశాఖ బీచ్ ల నందు జరుగుతుందని కమిషనర్ తెలిపారు.అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంరక్షణకు జీవీఎంసీ రామకృష్ణ బీచ్, సాగర్ నగర్, చేపల ఉప్పాడ, పెద నాగమయ్య పాలెం బీచ్ ల నందు మెకానికల్ బీచ్ క్లీనింగ్ నకు బదులు మే నెల చివరి వరకు మాన్యువల్ పద్ధతిలో ఆయా బీచ్ లను పారిశుద్ధ్య కార్మికులచే పరిశుభ్రత చర్యలు చేపడుతూ, తాబేలు సంతానం ఉత్పత్తికి సంరక్షణ చర్యలు జీవీఎంసీ చేపట్టడం జరిగిందని కమిషనర్ తెలిపారు.కావున ,బీచ్ లలో సందర్శించే సందర్శకులు, విహార యాత్రికులు వ్యర్థాలను బీచ్ లలో పడేయకుండా సమీపంలో గల డస్ట్ బిన్ లను ఉపయోగించాలని, తాబేళ్ల సంతాన ఉత్పత్తికి ఆటంక పరచరాదని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.