మహిళా సాధికారతే సీఎం జగన్ లక్ష్యం:వైవీ సుబ్బారెడ్డి

by Jakkula Mamatha |
మహిళా సాధికారతే సీఎం జగన్ లక్ష్యం:వైవీ సుబ్బారెడ్డి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజునే వైఎస్ జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అధికశాతం మహిళలకే దక్కేలా నిబంధనలు మార్చారని ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జీవీఎంసీ 51 వ వార్డు మాధవధార లో వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం జరిగాయి. ఆ సభలో మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక చేయూత నిచ్చే విధంగా ఐదు ఏళ్లలో 27 వేల కోట్లు డ్వాక్రా రుణాలు సీఎం జగన్ మాఫీ చేశారు.

చేయూత పథకం ద్వారా ప్రతి మహిళకు 5 ఏళ్లలో 75 వేల రూపాయలు అందే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు.మహిళ పరిస్థితి గతంలో దారుణంగా ఉండేదని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి నాడే మహిళ కష్టాలు తొలగిపోయాయని విశాఖ వైకాపా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. కార్యక్రమానికి నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తదితరులు హాజరయ్యారు. ఇటీవల రాజ్యసభకు ఎంపికైన సుబ్బారెడ్డిని ఆ సందర్భంగా సన్మానించారు.

Advertisement

Next Story

Most Viewed