- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: మత్య్సకారులతో ముఖాముఖిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దిశ, ఉత్తరాంధ్ర: మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపిన పార్టీ తెలుగుదేశమేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో మత్య్సకారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యాకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావాలని ఆలోచన ఎన్టీఆర్‌దేనని చెప్పారు. అందుకే ఆయన రాజకీయంగా బీసీలకు ప్రధాన్యతనిచ్చారని గుర్గు చేశారు. తన హయంలో రిజర్వేషన్‌ను 33 శాతానికి పెంచితే వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. 20 లక్షల మంది మత్య్సకారులుంటే చాలా ఆంక్షలతో లక్షమందికే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మత్స్యకారులకు డీజిల్‌పై రాయితీ ఇచ్చిన ప్రభుత్వం టీడీపీనేనని చెప్పారు. మత్య్సకారుల ఆపథ్ కాలంలో ఆరు లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశమన్నారు. మళ్లీ యువతకు జాబు రావాలంటే బాబు రావాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు.
‘మత్స్యకారుల కుటుంబ సభ్యులందరూ వేటకు వెళతారని, వేట మీదే బతికే వీరికి ఇంట్లో ఒకరికే మత్స్యకార భరోసానివ్వడం ఎంతవరకు సబబు’ అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. అమ్మవడి వస్తే మత్స్యకార భరోసా కట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
Read more: