- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ganta Srinivasarao: చంద్రబాబు సీఎం కావడం చారిత్రాత్మక అవసరం
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీమంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌లు స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా నాయకులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కావడం చారిత్రాత్మక అవసరమని వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా.. ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని చెప్పారు. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో.. వచ్చే ఎన్నికల్లో బాబు సీఎం కావడం అంతే నిజమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాల్లోనే వైసీపీ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలబడిందన్నారు. జగన్ ప్రభుత్వానికి నెలలు కాదని, రోజులే ఉన్నాయని గంటా హెచ్చరించారు. జగన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని సూచించారు. నాలుగేళ్ల పాలనలో ఒక ఇటుక వేయలేదని.. ఇప్పుడు పోర్ట్, ఎయిర్ పోర్టు కడతామంటే ఎవరూ నమ్మరన్నారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన చేస్తామంటే ప్రజలు విశ్వసించడం లేదని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి : Mp Kesineni Nani: ఆ శక్తి చంద్రబాబుకే ఉంది