బ్రేకింగ్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి క్లారిటీ

by srinivas |   ( Updated:2023-03-13 10:35:54.0  )
బ్రేకింగ్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి ప్రకటన చేసింది. ప్లాంట్ ప్రైవేటీకరణపై మరో నిర్ణయం లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న విషయం కూడా తెలుసని పేర్కొంది. కానీ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందు నుంచి చెబుతున్న మాటకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

దీంతో విశాఖ ఉద్యోగులు మరోసారి కేంద్రంపై మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలని అంటున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించినప్పుడల్లా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని చెబుతోంది. తాజాగా కూడా మరోసారి స్పష్టం ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed