Visakha: ఉక్కు పరిరక్షణకోసం బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ నేతల పోరాటం.. అరెస్ట్

by srinivas |   ( Updated:2023-04-15 10:10:36.0  )
Visakha: ఉక్కు పరిరక్షణకోసం బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ నేతల పోరాటం.. అరెస్ట్
X

దిశ, ఉత్తరాంధ్ర: ఉక్కు పరిరక్షణ కమిటీకి సంఘీభావంగా ఏపీ నిరుద్యోగ జేఏసీ, బీఆర్ఎస్, ఆమ్‌ఆద్మీ సంయుక్తంగా నిరసనకు దిగాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు గాజువాక సమీపంలో అర్థనగ్న ప్రదర్శన చేసి ప్లకార్డులను ప్రదర్శించారు. విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అని నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, మహిళ, వికలాంగుల, రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయడానికే ఈ ప్రైవేటీకరణ ప్రయత్నమని, ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

స్టీల్ ప్లాంట్ కూర్మంపాలెం గేటు నుంచి సింహాచలం అప్పన్న స్వామి సన్నిధి వరకు పాదయాత్ర చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని అప్పన్నస్వామికి ప్లకార్డ్‌ను ప్రదర్శించారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి సమయం హేమంత కుమార్, బీఆర్ఎస్ నాయకులు జగన్ మురారి, ఆమ్ ఆద్మీ నాయకులు లోకనాథం, వరసల శ్రీనివాసరావు, కేకె‌ఎస్‌ఎన్, పితాని భాస్కర్, చీకటి శ్రీను, పవన్, ఉమ్మడి అప్పారావు, డీఎస్పీ నర్సింగరావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story