Visakha: ఎన్టీపీసీలో ప్రమాదం.. ఇద్ద‌రు కార్మికుల దుర్మ‌ర‌ణం

by srinivas |
Visakha: ఎన్టీపీసీలో ప్రమాదం.. ఇద్ద‌రు కార్మికుల దుర్మ‌ర‌ణం
X

దిశ, ఉత్తరాంధ్ర: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం జరిగింది. ఎఫ్‌జీడీ నిర్మాణ పనులు జరుగుతుండగా కేబుల్ ట్రాక్ బెల్ట్ తెగిపోవడంతో 15 మీటర్ల ఎత్తు నుంచి కార్మికులు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed