- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌కు ఆ దమ్ముందా.. బోండా ఉమా సవాల్‌కు రిప్లై ఉంటుందా..?
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికలు ముగిసినా ఆ వాతావరణం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఐదేళ్లుగా నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. పోలింగ్ ముగిసి నాలుగు రోజులు అవుతున్నా రిలాక్స్ కావడంలేదు. గెలుపొటములపై పరస్పరం విమర్శించుకుంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల పోలింగ్ అనంతరం ఐపాక్ టీమ్‌ను కలిసి గతం కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవబోతోందని చెప్పారు. ఓటమిపై నిరాశతోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బోండా ఉమ కొట్టిపారేశారు.
జగన్ చెప్పిన దానికన్నా ఒక్క ఎమ్మెల్యే సంఖ్య తగ్గినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మూసివేస్తామని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా అని బోండా ఉమ ప్రశ్నించారు. ప్రజలు ఎవరివైపు ఉంటే వాళ్లే అధికారంలోకి వస్తారని తెలిపారు. నిరాశలో ఉన్న ఐ ప్యాక్ టీమ్‌లో జోష్ నింపేందుకే జగన్ అలా మాట్లాడారని చెప్పారని ఎద్దేవా చేశారు. కూటమి గెలుపు ఖాయమైందని, సీఎం జగన్ ఏడ్వలేక నవ్వుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎవరు గెలవబోతున్నారనేది.. ఐ ప్యాక్ టీమ్‌తో జగన్ మాట్లాడే సమయంలో పెద్దిరెడ్డి, బొత్స ముఖాలే చెబుతున్నాయని బోండా ఉమ విమర్శించారు. అన్ని సర్వేలు సైతం కూటమికే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. జగన్ అరాచక పాలనపై ఓటర్లు విసిగెత్తి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని బోండా ఉమ పేర్కొన్నారు. అయితే బోండా ఉమ విసిరిన సవాల్‌ను సీఎం జగన్ స్వీకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
Read More...
AP:కూటమి గెలిస్తే వైసీపీని మూసేస్తానని ప్రకటించు..జగన్ :టీడీపీ నేత