మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో కొనసాగుతున్న విజయవాడ సహాయక చర్యలు

by Mahesh |   ( Updated:2024-09-03 15:25:04.0  )
మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో కొనసాగుతున్న విజయవాడ సహాయక చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు. బుడమేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిని అక్కడకు చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యలు మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. కాగా ఈ రోజు సహాయక చర్యల్లో ఆరు హెలికాప్టర్ ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. అలాగే బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేస్తున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2,500 ఆహార పొట్లాలు చేరవేశారు. విజయవాడ పరిధిలో వరద ముంపుకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి లోకేష్ పిలుపు మేరకు సహాయ చర్యల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ పార్టీ శ్రేణులు చేరుకొని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందిస్తున్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో 14,452 మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. కాగా ఈ సహాయక చర్యలను మొత్తం మంత్రి నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed