Andhrapradeshలో రూ. 3520.56 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు

by srinivas |
Andhrapradeshలో రూ. 3520.56 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో 3520.56 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు కానున్నట్లు రాజ్యసభ సభ్యుడు, విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా పలు అంశాలను ఆయన వెల్లడించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభానికి తుది మెరుగులు దిద్దుకుంటోందని, అలాగే ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్పారు. భారీ బోట్ల రాకకోసం బ్రేక్ వాటర్ ఛానల్ నిర్మాణం పూర్తయినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. వ్యవసాయ స్టార్ట్ అప్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, దేశంలో వ్యవసాయ స్టార్ట్ అప్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ క్షేత్రంలో మట్టి పరీక్షలు నిర్వహించడం నుంచి పంటను మార్కెటింగ్ చేసేవరకు ప్రయోగాలు, ఉపాధి, వ్యాపారాలకు చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు.


కొత్త గవర్నర్ విజయసాయిరెడ్డి అభినందనలు

ఏపీ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని, ఆయన విశేష అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతగానో సహాయపడుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఆయన పదవీ కాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed