- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababuపై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు
దిశ, ఏపీ బ్యూరో: ఇటుకపేర్చని అమరావతి సందర్శన కోసం చంద్రబాబు జనం తరలింపునకు బాబు ప్రభుత్వం ఆర్టీసీకి 100 కోట్ల ఎగనామం పెట్టిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో దొంగ పోరాట దీక్ష ప్రత్యేక రైళ్లకు 11 కోట్ల టీటీడీ నిధులు మళ్లించారని ఆరోపించారు. ఆ సమయంలో ఎల్లో మీడియా ఒక్క వాక్యం రాయలేదని మండిపడ్డారు, 40+ ఇండస్ట్రీ విజనరీ చంద్రబాబు బీసీ జనగణన బిల్లు గురించి ఎప్పుడూ ఆలోచనే రాలేదా? అని ప్రశ్నించారు. బీసీ జనగణన జరిగితేనే వారికి రాజ్యాంగపరమైన హక్కులు కలుగుతాయని తెలియదా? అని నిలదీశారు. ఇస్త్రీ పెట్టె, 2 కత్తెర్లిచ్చి ఇంకేమైనా అడిగితే బీసీల తోకలు కత్తిరిస్తానంటాడని ఆరోపించారు.
'హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ డా.లాల్జీసింగ్ 1991లోనే డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ సాంకేతికతను అభివృద్ధి చేశారు. కోర్టు కూడా దాని ప్రామాణికతను అంగీకరించింది. అప్పుడు చంద్రం బొచ్చెలు కడుగుతున్నాడు. సిగ్గుండాలి అన్నిటికి 'నేనే' అని పచ్చి అబద్దాలు చెప్పడానికి. నెలకోసారి పెన్షన్లిచ్చే వాలంటీర్లు వేగులైతే...రోజూ నీ పేపరు వేసేవారు, నీ టీవీ సబ్ స్క్రిప్షన్ పే చేసే వారిని ఏమనాలి. ఆలోచనలకు తగ్గట్లే మీడియా ముసుగులో విషం పూస్తున్నావు. ముదిమి వయసులో చంద్రబాబు అరికాళ్లతో ఆలోచిస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి చిట్‌లో పేదలు దాచుకున్న డబ్బును ఇతర బిజినెస్‌లకు మళ్లించినట్టు తనిఖీల్లో బయటపడింది. రికార్డులు దాచేశావు. నోటీసులు ఎలా ఇస్తారని సొంత పత్రికలో ఏడుపు ఏడుస్తున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు
Also Read.....