ఆలయంలో విధులకు వచ్చి.. పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-07 10:53:43.0  )
ఆలయంలో విధులకు వచ్చి.. పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా.. యువత చెడుమార్గంలో పయనించకుండా చూసుకోవాల్సిన పోలీసులే దారి తప్పారు. ఎవరైనా పేకాట ఆడితే వారికి వార్నింగ్ ఇచ్చి.. ఇది తప్పు అని చెప్పా్ల్సిన పోలీసులే పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన విజయవాడ(Vijayawada)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ దుర్గమ్మ గుడిలో డ్యూటీ చేయడానికి వచ్చిన నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడారు.

దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారిపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. విధుల కోసం వచ్చి పేకాట ఆడిన సీఐలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేకాట ఆడుతూ దొరికిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed