- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ మైండ్ ఇన్‌స్టబిలైజ్ అయ్యిందేమో చూసుకో అంటూ లోకేష్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వర్మ.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ జైలు ముందుకు వెళ్లి సెల్ఫీ తీసుకుని.. ఆయన లోపల, నేను బయట అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై నారా లోకేష్ విమర్షలు గుప్పించారు. తాజాగా, లోకేష్ చేసిన కామెంట్స్‌కు ఆర్జీవి ట్విట్టర్ వేదికగా తన బెడ్ రూం నుంచి మాట్లాడిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ‘‘లోకేష్‌ను చూసి జాలిపడాలా.. నవ్వాలా.. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం సంబంధం ఉంది. నేనొక ఫిల్మ్ మేకర్‌నని.. సినిమాలు తీయడం నా పని. జనాలకు సేవ చేయడానికి పుట్టాను.. తిరుగుతున్నాను.. చస్తాను.. అని నేను ఎప్పుడైనా చెప్పానా బేబీ. నన్ను విమర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ సేవ అనే అంశం తప్పితే వేరే ఏ టాపిక్ దొరకలేదా. నేను నీ ప్లేస్‌లో ఉంటే ఏం చెప్తానో తెలుసా..
‘వాడో పిచ్చోడు. హిట్ ఇచ్చి చాలా రోజులు అయింది. పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తాడు. అడ్డదిడ్డమైన ట్వీట్స్ పెడతాడు. అలాంటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు. పొద్దున లేచి పోర్న్ చూస్తాడు. ఇమ్మోరల్ పర్సన్, రెస్పాన్సిబిలిటీ ఉండదు. అలాంటి వ్యక్తిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అని చెప్పొచ్చు కదా. ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎట్లా బేబీ. అంటూ తనపై ఎలాంటి విమర్శలు చేయోచ్చో కూడా ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అలాగే.. ‘‘నా లైఫ్ ఓపెన్ బుక్. నీలాగా ఎక్కడో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోలను దాచేసి.. నేనెప్పుడూ చెప్పను. చంద్రబాబు ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఇన్‌స్టబిలైజ్ అయ్యిందేమో చూసుకో. మీ ఫాదర్‌ని దేవుడు కూడా కాపాడలేడు. నిన్ను చూస్తే నాకు బాధ కలుగుతుంది. లండన్‌కో ఎక్కడికో వెళ్లి రెస్ట్ తీసుకొని మనసును శాంతపరుచుకుంటే మంచిది. నువ్వు హాయిరాన పడి ఏది పడితే అది మాట్లాడితే రాంగ్ సిగ్నల్ వెళుతుంది. నీ మంచి కోసం నేను చెప్తున్నా’’ అంటూ ఆర్జీవి లోకేష్‌కు తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.