- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఈవీఎం ధ్వంసం చేసిన కేసు, హత్యయత్నం వంటి కేసులు నమోదయ్యాయి. దీంతో పిన్నెల్లిని పోలీసులు కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేశారు. జూన్ 26 నుంచి పిన్నెల్లి నెల్లూరు జైలులోనే ఉన్నారు. అయితే ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. నేడు (శుక్రవారం) బెయిల్ పై తీర్పు చెప్పనుంది. జిల్లా కోర్టులో రెండు సార్లు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. షరతులకు కట్టుబడి ఉంటానని..బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి కోరారు. ఎన్నికల టైమ్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.