- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కులవివక్ష కోరలు విప్పి బుసలుకొడుతుంది..
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంలో కుల వివక్ష కోరలు విప్పి బుసలు కొడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న కులవివక్షపై జాతీయ ట్రైబల్ కమిషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ పాలనలో కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతోంది అని ఫిర్యాదులో ఆరోపించారు. ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తన పత్రికా సమావేశం గిరిజన మహిళపై కులవివక్షకు పాల్పడ్డారు అని చెప్పుకొచ్చారు. యానాది కులానికి చెందిన ఆత్మకూరు మునిసిపాలిటీ చెర్మన్ వెంకటరమణమ్మను పత్రికా సమావేశంలో నిలబెట్టి అవమానించారు అని ఆరోపించారు.
ఆత్మకూరుకు ప్రధమ మహిళ వెంకటరమణమ్మను గిరిజన మహిళ అయినందుకే ఎమ్మెల్యేలతో సమానంగా గౌరవించలేదు అని ఆరోపించారు. గిరిజన మహిళను నిలబెట్టి అవమానించడం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ -3 ప్రకారం శిక్షార్హం అని చెప్పుకొచ్చారు. శాసనసభ సభ్యుడిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి చట్టాలను ఉల్లంఘించడం దారుణంమన్నారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన వారిపై అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని ఫిర్యాదులో కోరారు. సామాజికంగా వెనుకబడిన అణగారిన వర్గాల వారి హక్కులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.