- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking : పవన్ కళ్యాణ్‌తో వల్లభనేని భేటీ..
దిశ వెబ్ డెస్క్: వైసీపీకి గుడ్ బై చెప్పిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తాను జనసేన గూటికి చేరుతున్నట్లు ఇటీవల బహిరంగంగా పరకటించిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిసిన ఎంపీ వల్లభనేని బాలశౌరి పవన్ కళ్యాణ్ తో చాల సేపు చర్చించారు. ఈ నేపథ్యంలో వారిరువు ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఈ ఘటనతో బాలశౌరి జనసేన తీర్ధం పుచ్చుకోవడం ఖాయం అని తెలుస్తుంది.
దీనితో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అయితే ప్రస్తుతం ఆయన బందరు నుంచి బరిలోకి దిగుతారా..? లేదా ఆయన సొంతూరు గుంటూరుపై గురిపెట్టారా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా గతంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితుడైన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీ అధిష్టానం వైకిరికి అసహనానికి గురై పార్టీకి రాజీనామా చేసిన విషయం అందరికి సుపరిచితమే. తనకు పార్టీ లో తగిన ప్రాధాన్యత లేదని.. అందుకే తాను పార్టీని వీడుతున్నాని రాజీనామా లేఖను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు. అయితే రాజీనామా ఇవ్వక ముందే ఆయన సోషల్ మీడియా ఆకౌంట్ లో జగన్ ఫోటోలను షేర్ చేయకపోవడం కూడా ఆయన పార్టీని వీడుతున్నారనే చర్చకు కారణమైయ్యాయి. అయితే ఆ వార్తను నిజం చేస్తూ ఆయన వైసీపీకి రాజీనామా ఇచ్చారు.
Read More..
పవన్ కల్యాణ్ నివాసానికి వైసీపీ ఎంపీ.. కాసేపట్లో చేరిక తేదీ ప్రకటన
ఆ రోజు రాజకీయ ప్రయాణంపై నిర్ణయం ప్రకటిస్తా.. మాజీమంత్రి కొణతాల