సరికొత్త వ్యూహంతో వైకాపా పరిస్థితి అగమ్యగోచరం.. త్వరలోనే పొత్తుల అంశం కొలిక్కి!

by Jakkula Mamatha |   ( Updated:2024-03-04 10:00:51.0  )
సరికొత్త వ్యూహంతో వైకాపా పరిస్థితి అగమ్యగోచరం.. త్వరలోనే పొత్తుల అంశం కొలిక్కి!
X

దిశ, ప్రతినిధి: త్వరలోనే పొత్తుల అంశం తేలిపోతుందని,మూడు పార్టీల మధ్య పొత్తుతో కూటమి విజయాన్ని సాధిస్తుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. కుల వ్యవస్థ అన్నది ప్రస్తుత సమాజానికి అవసరం లేదని,కులాల వారీగా చలామణి అయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత నాలుగేళ్ల క్రితం పాలక పక్షంలో ప్రతిపక్షం గా నేనొక్కడినే,ఇప్పుడు ఎంతోమంది తనతో కలిసి వచ్చారన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,లావు శ్రీకృష్ణదేవరాయలు తో పాటు,మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా బయటకు వచ్చేశారన్నారు.సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టిన పాలకులు,రేపు మన ఆస్తులను కూడా తాకట్టు పెట్టే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు.సచివాలయాన్ని 350 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టటం సిగ్గనిపించటం లేదాని ప్రశ్నించారు. టూరిజం ప్రాజెక్టు పేరిట రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖపట్నం రుషికొండ పై విలాసవంతమైన ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నాడని, దీనితో ఎవరిని ముఖ్యమంత్రిగా ఉంచాలి, ఎవరిని ఇంటికి పంపించాలన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు.

ఎన్నికల అనంతరం ఓదార్పు యాత్ర 2.0 కచ్చితంగా కార్యకర్తల కోసం చేయాలని,మూడు రోజుల క్రితం వరకు ఆ పార్టీలో కొనసాగిన నిర్భాగ్యుడిగా చెబుతున్నా నన్నారు.క్రూ సిస్టం ఖర్చుల వరకు కూడా వ్యూహం సినిమా కలెక్షన్లు వసూలు కాలేదని,అదే గతంలో మాదిరిగా ప్రింటర్ సిస్టం ఉండి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని,ఇటువంటి కలెక్షన్లు వసూళ్లు చేసే సినిమాలు బహు అరుదుగా విడుదల అవుతాయని అపహాస్యం చేశారు.పులివెందుల పులిబిడ్డ గా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పులివెందులలోనే వ్యూహం సినిమాను ప్రదర్శించలేదని పేర్కొన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఒక బటన్ నొక్కితే చాలని, కూటమి అభ్యర్థి ఎవరు ఉంటే వారికి ఓటు వేయాలని సైకిల్,గాజు గ్లాసు,కమలం పువ్వు గుర్తు లో ఏదో ఒక్క గుర్తు మాత్రమే ఈవీఎంలపై ఉంటుందని,విరిగిన ఫ్యాను రెక్కలు దూరంగా ఉంటూ,కూటమి అభ్యర్థి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వ్యూహం సినిమా కలెక్షన్ల లాగే రేపు పోలింగ్ బూత్ లో వైకాపాకు ఓట్లు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

Read More..

YS వివేకా మర్డర్ కేస్.. MP వైఎస్ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సంచలన సవాల్

Advertisement

Next Story

Most Viewed