- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భార్యకు ఇష్టంలేని సెక్స్ -భర్తపై రేప్ కేసు: కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన వాసిరెడ్డి పద్మ
దిశ, డైనమిక్ బ్యూరో : భార్యకు ఇష్టం లేకుండా లైంగిక చర్యకు పాల్పడిన భర్తపై మారిటల్ రేప్ కేసులు నమోదు చేసే విషయంలో సుప్రీంకోర్టు సూచనల ప్రకారం కేంద్ర హోం శాఖ వివిధ సమూహాల నుండి అభిప్రాయ సేకరణ కోరిన సంగతి తెలిసిందే. వివాహ వ్యవస్థ పై దీని ప్రభావం పై చర్చించాలని తెలియజేసింది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా లేఖ అందుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశంపై సోమవారం సమగ్రంగా చర్చించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన కమిషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులు గజ్జల వెంకటలక్ష్మి, బూసి వినీత, కుమారి గెడ్డం ఉమ, శ్రీమతి రోకియా బేగం ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... మహిళల భద్రత కోసం చేస్తున్న చట్టాలు సద్వినియోగం కాకపోవటం వల్ల దుర్వినియోగం అవుతున్నాయని దీనిని సాకుగా చూపి కొత్త చట్టాలు చేయటానికి ప్రభుత్వాలు వెనకాడుతున్నాయని అన్నారు. స్త్రీలకు తమ శరీరంపై వారికి హక్కు ఉందని, ఇష్టం లేకుండా భర్త అయినా లైంగిక చర్య చేస్తే రేప్ కేసులు నమోదు చేయటం ఆహ్వానించదగిన పరిణామం అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. స్త్రీల హక్కులను పరిరక్షిస్తూ వివాహ వ్యవస్థ ఒడిదుడుకులకు గురికాకుండా అవగాహన, సామాజిక చైతన్యంతో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. మరోవైపు లీగల్ కౌన్సిలర్ ఎ.పూజిత యాదవ్ మాట్లాడుతూ... మారిటల్ రేప్ కేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో జరుగుతున్న పరిణామాలను వివరించారు. కమిషన్ సెక్షన్ ఆఫీసర్లు ఎస్.వి.ఎస్ శైలజ, బి సంధ్య కేంద్ర హోం శాఖ పంపిన నోట్ వివరాలను వెల్లడించారు. సోషల్ వర్కర్ దేవి వివాహ వ్యవస్థలో మహిళలపై సెక్సువల్ దాడులను గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళా కమిషన్ సభ్యులు లైంగిక సంబంధాల విషయంలో భార్యలపై దాష్టికం జరుగుతున్న కేసులను వివరించారు. కాబట్టి భర్తలపై రేప్ కేసులు నమోదు చేసే విషయంలో ఇది చాలా సున్నితమైన అంశాలతో మరియు అవగాహనతో కూడిన అంశమయినందున చట్టంగా రూపొందించు విషయములో తగు జాగ్రతలతో వ్యవహరించవలసి ఉంటుందని మహిళా కమిషన్ అభిప్రాయపడింది.