దేశం గర్వంచే విషయంలో బిగ్ షాక్... సీఎం జగన్‌పై అమిత్ షా షాకింగ్ కామెంట్స్

by srinivas |   ( Updated:2024-05-05 10:49:29.0  )
దేశం గర్వంచే విషయంలో బిగ్ షాక్... సీఎం జగన్‌పై అమిత్ షా షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: జనవరి 22న దేశం గర్వంచదగ్గ కార్యక్రమం జరిగింది. ఎన్నో ఏళ్ల కల సారమైన రోజు. ఆధ్యాత్మికులు నుంచి పొలిటీషియన్ వరకూ అందరూ అక్కడే ఉన్నారు. ఎంతో వైభవంగా కార్యక్రమం జరిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ కార్యక్రమాలను వీక్షించి దేశ ప్రజలు పులకించి పోయారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం పట్టించుకోలేదు. అసలు ఏమీ జరగలేదనట్లు అతని కార్యక్రమాలు చేసుకుపోయారు. అయితే ఇన్నాళ్లకు ఆ విషయంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రామమందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీ నాయకులు, రాజకీయ సినీ ప్రముఖులు, ఆధ్యాత్మిక వాసులు, పండిపతులు తదితరులంతా రాముడిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ప్రముఖులు సైతం అయోధ్య వెళ్లారు. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలరాముడిని దర్శించుకుని జన్మ ధన్యం చేసుకున్నారు.

అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం హాజరుకాలేదు. రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించే ఆయన ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దీంతో పలు విమర్శలు వినిపించాయి. ఇన్ని రోజులకు కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని ఆహ్వానించినా కార్యక్రమానికి రాలేదని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించిన అమిత్ షా.. రాహుల్ గాంధీతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డికి అయోధ్య రామమందిరం ఆహ్వానం అందినా వాళ్లు రాలేదని మండిపడ్డారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడిందని తెలిపారు. రెండోసారి ప్రధాని అయిన వెంటనే రామమందిరాన్ని మోడీ పూర్తి చేశారని గుర్తు చేశారు. అవినీతి, మత మార్పిడులకు పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. ఏపీకి అమరావతే రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని, అందుకోసమే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అవినీతి, ల్యాండ్ మాఫియా రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిందని మండిపడ్డారు. నేరస్తుల్ని అరికట్టి, అవినీతి అంతమొందిస్తామని అమిత్ షా హెచ్చరించారు.

Advertisement

Next Story