- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tragedy: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District) అన్నంబాక(Anambaka)లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. ఆదివారం రోజు కావడంతో ఇద్దరు యువకులు సరదాగా ఈత కొట్టేందుకు స్థానిక చెరువు(Pond) వద్దకు వెళ్లారు. కొంతసమయం పరిసర వాతావరణాన్ని ఆస్వాదించారు. అనంతరం ఈత(Swimming) కొట్టేందుకు చెరువులోకి దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు యువకులను గండం ముంచేసింది. దీంతో ఇద్దరూ మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చెరువులో నుంచి యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మృతులు శ్రీకాంత్, ఆనంద్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుల ప్రాణాలు పోవడం చాలా బాధకరమన్నారు. ఈత వస్తేనే చెరువుల వద్దకు వెళ్లాలని, లేనిపక్షంలో ఆ వైపు వెళ్లొద్దని సూచించారు. ఒక వేళ స్నానానికి వెళ్లాలంటే పక్కనే ఈత తెలిసిన వాళ్లని తీసుకెళ్లాలని చెప్పారు. పిల్లలను అసలు చెరువుల వద్దకు తీసుకురావద్దొని పోలీసులు సూచించారు. సరదా కోసం చెరువులు, కుంటలు, కాలువల్లోకి దిగి ప్రమాదాల బారిన పడొద్దని పోలీసులు తెలిపారు.