శ్రీలంక కోస్ట్‌గార్డ్స్ అదుపులో సిక్కోలు వాసులు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

by srinivas |   ( Updated:2024-07-29 14:51:20.0  )
శ్రీలంక కోస్ట్‌గార్డ్స్ అదుపులో సిక్కోలు వాసులు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంకలో ఇద్దరు సిక్కోలు మత్య్సకారులు చిక్కుకున్నారు. 40 రోజుల క్రితం సముద్రంలో బోటు ద్వారా చేపల వేటకు వెళ్లారు. తమిళనాడు నుంచి శ్రీలంక వైపు వెళ్లడంతో కోస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరు మత్య్సకారుల యోగక్షేమం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని విడిపించాలని కోరుతున్నారు.

కాగా సిక్కోలుకు చెందిన మత్య్సకారులు కొర్లయ్య, వెంకయ్య 40 రోజుల క్రితం వీరావలి ప్రాంతం నాగపట్నంలో వేటకు వెళ్లారు. అంతర్జాతీయ సరిహద్దులు తెలియకపోవడంతో శ్రీలంక వైపు వెళ్లారు. దాంతో వాళ్లిద్దరిని శ్రీలంక కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. వేటకు వెళ్లే ముందు ఇద్దరు మత్స్యకారులు తమతో మాట్లాడారని, ఇప్పటివరకూ సమాచారం తెలియలేదని తెలిపారు. తాము ఫోన్ చేసినా స్విచ్ఛాప్ వస్తోందని తెలిపారు. తమ భర్త కష్టపడి సంపాదిస్తేనే తమకు పూట గడుస్తుందని, ఆయన లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గాని, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించి శ్రీలంక కోస్ట్ గార్డ్స్‌తో మాట్లాడి తమ వారిని విడిపించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story