- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీటీడీ మరో కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో గత పాలకమండలి తీర్మానాలు
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు భక్తులకు అందిస్తున్న ఆన్ లైన్ సేవలకు ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత పాలకమండలి తీర్మానాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని భావించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకూ జరిగిన పాలకమండలి సమావేశాలు, వాటి వివరాలు, అప్పుడు తీసుకున్న నిర్ణయాలను వెబ్ సైట్‌లో పొందుపర్చింది. మొత్తం 8 పాలకమండలి సమావేశాల పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది. తద్వారా గత ప్రభుత్వ హయాంలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేసింది. అలాగే ప్రస్తుతం టీటీడీలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది సైతం ఎప్పటికప్పుడు భక్తులకు వివరించాలని అధికారులను టీటీడీ ఆదేశించింది. టీటీడీ పాలనలో పారదర్శకత పాటించాలని సూచించింది. టీటీడీ ఆదేశాలతో గత పాలకమండలి తీర్మానాలను అధికారులు వెబ్ సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.